
నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ని తమిళ స్టార్ విజయ్ ‘జన నాయగన్’గా రీమేక్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే, ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ సన్నివేశం హక్కులు మాత్రమే కొనుగోలు చేసినట్లు, మిగతా కథ వేరని సమాచారం. ఈ సీన్ కోసం భారీ మొత్తం చెల్లించారని టాక్. అనీల్ రావిపూడిని రీమేక్ డైరెక్ట్ చేయమని కోరినా, అది కుదరలేదు. టీజర్, ట్రైలర్ విడుదలయ్యే వరకు క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య ఫ్యాన్స్ ఈ రీమేక్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ కెరీర్‌లో ఈ సినిమా హిట్ సాధిస్తుందా అనేది చూడాలి.