
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 42వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సందడి చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే తారక్’ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ ఇంటి ముందు భారీ కటౌట్స్తో అభిమానులు అరుపులు, కేకలతో హోరెత్తించారు. సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ ఆయురారోగ్యాలతో, విజయాలతో ఉండాలని అభిమానులు పూజలు చేశారు. వేడుకల ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’, ‘దేవర 2’, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. RRR, దేవర సక్సెస్‌తో మెప్పించిన తారక్, ఈ చిత్రాలతో మరోసారి రికార్డులు బద్దలు కొట్టనున్నారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.