‘ఎల్లమ్మ’తో వేణు గట్టి ప్లాన్ – నితిన్ గ్రీన్ సిగ్నల్‌తో సెట్స్‌పైకి సినిమా

Screenshot 2025 05 20 162505

దర్శకుడు వేణు ఉడుగుల ‘ఎల్లమ్మ’ సినిమా గత ఏడాదిగా హీరోల చుట్టూ తిరుగుతూ ఫైనల్‌గా నితిన్‌తో సెట్ అయింది. మొదట నాని, శర్వానంద్, తేజ సజ్జాలకు ఈ కథ వినిపించినా, వివిధ కారణాలతో వారు తిరస్కరించారు. చివరకు నితిన్‌కు కథ నచ్చడంతో ఒప్పందం కుదిరింది. తాజాగా, వేణు ‘ఎల్లమ్మ’ స్క్రిప్ట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై చిత్రీకరణకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. ఈ సినిమా వేణు రెండో ప్రాజెక్ట్‌గా భారీ విజయం సాధించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. నితిన్‌తో ఈ కాంబినేషన్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసిన వేణు, ఈ చిత్రాన్ని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. నిర్మాణ సంస్థ కూడా ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి నమ్మకంతో ఉంది. ‘ఎల్లమ్మ’ కథ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది చూడాల్సి ఉంది. నితిన్ కెరీర్‌లో ఈ సినిమా మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.