
టాలీవుడ్ కింగ్ నాగార్జున మాస్ సినిమాలకు పెట్టింది పేరు. డైరెక్టర్ వీరూ పోట్లతో చేసిన ‘రగడ’ ఆయన కెరీర్‌లో ఊర మాస్ చిత్రంగా నిలిచింది. నాగ్ డైలాగ్ డెలివరీ, కామెడీ, మాస్ మూమెంట్స్ అభిమానులకు ఇప్పటికీ స్పెషల్. ఈ సినిమా రీరిలీజ్‌కు సిద్ధమవుతోందని తాజా సమాచారం. ప్రస్తుతం రీరిలీజ్ సన్నాహాలు జరుగుతున్నాయి, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. అనుష్క, ప్రియమణి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ‘రగడ’ రీరిలీజ్‌తో థియేటర్లలో మళ్లీ హడావిడి చేయనుంది. నాగార్జున అభిమానులకు ఈ రీరిలీజ్ పండగలా ఉండనుంది. మాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘రగడ’ మళ్లీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.