‘అఖండ 2’ క్లైమాక్స్ షూట్ – జార్జియాలో బాలయ్య మాస్ జాతర?

Screenshot 2025 05 17 093350

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ షూటింగ్ ఊపందుకుంది. ఈ భారీ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ జార్జియాకు వెళ్లనుంది. మే 21 నుంచి బాలయ్యతో పాటు పలువురు ఫైటర్స్ పాల్గొనే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. బోయపాటి జార్జియాలో లొకేషన్స్ ఖరారు చేశారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘అఖండ’ సక్సెస్ తర్వాత సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్లైమాక్స్ సీన్స్ మాస్ ఆడియెన్స్‌ను థ్రిల్ చేయనున్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. బాలయ్య ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.