
నందమూరి బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సంచలనం సృష్టించారు. ఈ బ్రాండ్‌కు సంబంధించిన తాజా యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలయ్య లుక్, స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ‘అన్‌స్టాపబుల్’ షోలో మ్యాన్షన్ హౌస్ ప్రకటనలకు భాగస్వామిగా వ్యవహరించిన బాలయ్య, ఇప్పుడు నేరుగా యాడ్‌లో నటించారు. మరోవైపు, ‘అఖండ 2’తో బాలీవుడ్‌ను టార్గెట్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో గద, త్రిశూలం కలిపిన కొత్త ఆయుధం ఉపయోగించనున్నారు. హిందీ ప్రేక్షకుల కోసం బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారు. ఉత్తరాది మార్కెట్ కోసం టీమ్ విస్తృత ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది. బాలయ్య ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ ఝలక్ ఇవ్వనున్నారు.