‘పెద్ది’తో రెహమాన్ సంగీత మాయాజాలం – రామ్ చరణ్ మ్యాజిక్

peddi firstlookwinsover

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ‘పెద్ది’ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. బుచ్చిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమా ఆల్బమ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రతి పాటకు 20-30 ఆప్షన్స్ ఇచ్చి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తున్నారని బుచ్చిబాబు తెలిపారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల అంచనాలను పెంచాయి. రామ్ చరణ్ గత విజయాలు, రెహమాన్ సంగీతంతో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించనుందని అందరూ ఆశిస్తున్నారు. బుచ్చిబాబు మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటనున్నారని అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.