
సీనియర్ హీరో రాజశేఖర్ విలన్‌గా కొత్త అవతారమెత్తనున్నారు. గతంలో యాంగ్రీ మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్, ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ జనార్థన్ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన కొత్త గెటప్‌లో కనిపించనున్నారని, ఫొటో షూట్ కూడా పూర్తయిందని సమాచారం. రాజశేఖర్ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటుందని, ఈ సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో బాలకృష్ణ, రామ్ సినిమాల్లో విలన్‌గా నటిస్తారని వార్తలొచ్చినా అవి నిజం కాలేదు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్లో రాజశేఖర్ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ, రౌడీ జనార్థన్తో రాజశేఖర్ క్రేజీ విలన్‌గా మారిపోతారని అంటున్నారు. ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి