తెలుగులో ‘కేసరి చాప్టర్ 2’ – చారిత్రక డ్రామాతో మరో సంచలనం

Kesari 2 Telugu RAW

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన చావా హిందీ, తెలుగులో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే కోవలో కేసరి చాప్టర్ 2 తెలుగు డబ్బింగ్ వెర్షన్ మే 23న రిలీజ్ కానుంది. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగులో అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాయి. హిస్టారికల్ కోర్ట్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం, 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కింది. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే, రెజినా కసాండ్రా నటించిన ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించాడు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం హిందీలో ఏప్రిల్ 18న విడుదలై సక్సెస్ అయింది. అక్షయ్ కుమార్ బ్రిటిష్ ప్రభుత్వంలో న్యాయవాదిగా, జనరల్ డయ్యర్‌పై కేసు వేసే పాత్రలో నటించాడు. ఈ కేసులో అతని విజయం ఏమైందనేది చిత్ర కథ. తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.