
సంతానం, గీతిక తివారీ నటించిన కామెడీ హారర్ చిత్రం డెవిల్స్ డబుల్స్ నెక్స్ట్ లెవెల్ మే 16న విడుదల కానుంది. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో ది షో పీపుల్, నీహారిక ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సినిమా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. శ్రీ తిరుమల తిరుపతి గోవింద నామాలను ర్యాప్ సాంగ్గా చిత్రీకరించడంపై హిందూ సంఘాలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ పాట హిందువుల మనోభావాలను గాయపరిచిందని ఆరోపిస్తూ తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమిళనాడులో సినిమాను నిషేధించాలని, లేదా ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సాంగ్ వీడియో వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది. తమిళనాడులోని హిందూ సంఘాలు కూడా గత కొన్ని రోజులుగా ఈ సాంగ్ తొలగింపును కోరుతున్నాయి. సినిమా బృందం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.