
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా సీక్వెల్ ‘అఖండ 2’ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో స్పెషల్ ఎలిమெంట్‌పై చర్చ హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య-బోయపాటి సినిమాల్లో ఆయుధాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ‘అఖండ’లో త్రిశూలంతో బాలయ్య అఘోర గెటప్ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘అఖండ 2’ కోసం బోయపాటి మరో అడ్వాన్స్‌డ్ ఆయుధాన్ని డిజైన్ చేయించారట. ఈ ఆయుధం మైథాలజీ టచ్‌తో, సరికొత్త లుక్‌లో హైలైట్ కానుందని సమాచారం. ఈ చిత్రంలో బాలయ్య ఎలాంటి గెటప్‌లో దర్శనమిస్తారనే ఆసక్తి నెలకొంది. బోయపాటి మాస్ డైరెక్షన్, బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ‘అఖండ 2’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.