
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు! లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా మూవీలో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ కీలక పాత్రలతో సందడి చేయనున్నారు. తాజాగా లోకేష్ ఇచ్చిన అప్డేట్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. “‘విక్రమ్’లో సూర్య, ఫహద్ పాత్రల్లా ‘కూలీ’లోనూ ప్రతి క్యారెక్టర్ కథకు బలమైన కనెక్షన్ ఉంటుంది. థియేటర్స్‌లో సినిమా చూస్తే షాక్ అవుతారు” అని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అప్డేట్తో రజినీ ఫ్యాన్స్ ఉత్సాహం డబుల్ అయింది. ‘కూలీ’ రిలీజ్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది.