తెలుగు ప్రజల విషనరీ – నారా చంద్ర బాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు

1950 ఏప్రిల్ 20 అనగా సరిగ్గా 75 సంవత్సరాలు పుట్టారు నారా చంద్రబాబునాయుడు గారు. ఆయన తెలుగు రాష్ట్రాలలో పుట్టడం అనేది తెలుగు ప్రజలకు నిజంగా ఓ అదృష్టం అని చెప్పుకోవాలి. ఓ మానవ యంత్రం లాగా వయసును లెక్కచేయకుండా నిరంతరం ఆయన కష్టపడుతూనే ఉంటారు. ఆ కష్టం తనకు మాత్రమే ఉపయోగపడేలా కాకుండా తన తోటి ప్రజలకు, తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడాలని అనుకుంటారు. యంత్రాలు అలసిపోతాయి. కానీ ఆయన ఏనాడు అలిసిపోలేదు. బాధ, నొప్పి అనేవి ఆయనను ఏనాడు ఆపలేదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆయన ప్రజా శ్రేయస్సు కోరడం మానుకోలేదు. నిజంగా ఓ మానవ యంత్రం లాగానే తన ఆలోచనలు మెరుగుపరుచుకుంటూ తెలుగు ప్రజలకు ఆయన జీవితం అంకితం చేశారు.

WhatsApp Image 2024 04 20 at 08.34.51 adb742cf

ఆధునికరణ అనే ఓ విజన్ తో, ఆయన విజనరీ తో నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నారు. కొందరు నీచులు ఆయనకు వ్యతిరేక శక్తులుగా ఆయనను ఇబ్బందులు పెట్టినప్పటికీ ఆయన ముఖంలో నవ్వు చెక్కు చెదరలేదు, ఆయన ఆలోచనలు మార్పు రాలేదు. 75 ఏళ్ల వయస్సులో కూడా ఫుల్ టూ ఛార్జ్ అన్నట్టు పనిచేసుకునే పోతున్నారు. ఆయన వాయిస్ పెంచుకుంటూనే పోతున్నారు. అలాంటి తెలుగు జాతి నిత్య శ్రేయస్సు కోరుకునే నారా చంద్రబాబునాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మొత్తం తెలుగుజాతి ఆయన వెనుక ఉందని మరోసారి గుర్తు చేసుకుంటూ ఆయన బావుండాలని ఆశిద్దాం.